అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి గ్రామం నందు స్థాపించిన వ్యాలీ గ్రీన్ గార్మెంట్ పరిశ్రమను శనివారం గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్ 10వ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, గతంలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేదని, ఇప్పుడు స్థానికంగా మరింత ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషకరమని అన్నారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడంపై వారు ప్రశంసలు కురిపించారు.
ఈ పరిశ్రమను స్థాపించిన పెరుమాళ్ళ జీవానంద్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పరిశ్రమ వారి కోసం కొత్త అవకాశాలను తెరిచిందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సాకే సతీష్, ఉపాధ్యాయులు ఒకేషనల్ నరసింహామూర్తి, అరుంధతి, జ్యోతి, ప్రొడక్షన్ మేనేజర్ అశోక్, అకౌంటెంట్ పవన్, క్వాలిటీ ఇన్చార్జి నారాయణ, మెకానిక్ బాషా, క్వాలిటీ మేనేజర్ చిధానంద్, రీసెప్షన్ అప్సనా, సుధాకర్, రంగా, సుధా, వెంకటేష్, మద్దిలేటి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ పరిశ్రమ ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, వారి జీవితాలలో మార్పులు తీసుకురావడం నిన్నటి పరిస్థితుల నుంచి ఎంతో అభివృద్ధిని చేకూర్చే దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.