అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బాట సుంకలమ్మ ఆలయ ప్రాంగణంలో వసతి గృహ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ మరియు సోదరుడు గుమ్మనూరు నారాయణ లతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పూజలు అనంతరం, వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ నాయక్, టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, జక్కలచెరువు ప్రతాప్, స్టోర్ డీలర్ రంగస్వామి, వెంకటరాముడు, చికెన్ శ్రీనివాసులు, చెరకూరి లక్ష్మణ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.