సినీ నటుడు మోహన్ బాబు మీడియా మిత్రులపై దాడి చేసిన ఘటనకు నిరసనగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏపీడబ్ల్యూజే, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్ నాయకులు మాట్లాడుతూ మీడియా కవరేజ్ కి వెళ్ళిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడం హేయమైన చర్య, తక్షణమే మోహన్ బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సినీ నటుడు మోహన్ బాబు పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని స్థానిక గుత్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సై సురేష్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయులు తన్నీరు శ్రీనివాసులు, అబ్దుల్ సుభాన్, రఫిక్ ,శేఖర్ గౌడ్, సులేమాన్, నాగరాజు, కాజా, మహబూబ్ బాషా, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.