అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ ఆద్వర్యంలో గుత్తి పట్టణం, కొత్తపేట గ్రామం ,బాచుపల్లి గ్రామం , ఊబిచర్ల గ్రామంలో సాగునీటి చేరువు ఎలక్షన్ ఏకగ్రీవంగా జరిగాయి.గుమ్మనూరు నారాయణ చేతుల మీద సాగునీటి చెరువు ఎలక్షన్ రైతులు ఏకగ్రీవంగా ఎన్నుకున్న బాచుపల్లి గ్రామం ప్రెసిడెంట్ ఎన్ రంగస్వామి వైస్ ప్రెసిడెంట్ పి సురేష్ ,ఊబిచర్ల గ్రామం ప్రెసిడెంట్ శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ నక్క ఆంజనేయులు , కొత్తపేట గ్రామం ప్రెసిడెంట్ నాగభూషణం వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు నాయుడు,గుత్తి పట్టణం ప్రెసిడెంట్ కేశవ నాయుడు గ వైస్ ప్రెసిడెంట్ హనుమంత రెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుత్తి మండలం రైతులు అందరు కలిసి సాగునీటి చెరువు ఎలక్షన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అదేవిధంగా గుమ్మనూరు కుటుంబం మీకు ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటుందంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అందుకే చౌదరి మండల కన్వీనర్ బద్రవలి జక్కలచెరువు ప్రతాప్ చికెన్ శ్రీనివాసులు ఎర్రగుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు