గుత్తి పట్టణం అనంతపురం రోడ్డు లో గల నాయకంటి శివప్రసాద్, నాయకంటి రవి గార్ల నూతన ఎన్ పి ఆర్ ప్లాజా అన్నపూర్ణ రెసిడెన్సీ హోటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సోదరుడు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి అన్నపూర్ణ రెసిడెన్సీ హోటల్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి పట్టణానికి దాదాపుగా 30 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల పరిధి వరకు ఎటువంటి సౌకర్యవంతమైన వసతి హోటల్లు లేవు ఇప్పుడు అత్యాధునిక శోభగులతో తీర్చిదిద్దిన ఎన్ పి ఆర్ ప్లాజా అన్నపూర్ణ రెసిడెన్సి హోటల్ నిర్మించినందుకు నాయకంటి సోదరులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు.