అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని సాగునీటి ఎన్నికలలో ఉత్తర కాలవ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ గా కే.రాజారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయానికి కారకులైన రైతులకు మహిళా రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశమిచ్చిన తాడిపత్రి నియోజకవర్గపు ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దిమ్మగుడి సర్పంచ్ రామచంద్ర రెడ్డి, కే.రామిరెడ్డి,కే.కే రెడ్డి, కే.రాజశేఖర్ రెడ్డి,బి.గిరి రెడ్డి, బద్రి,సంజీవ రాయుడు గిరప్ప,సాంబా తదితరులు పాల్గొన్నారు.
