అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం పరిటాల రవి కల్యాణ మండపం లో ఇటీవల ఎన్నికైన సాగునీటి సంగం ఛైర్మెన్లు, వైస్ ఛైర్మెన్లు, డైరెక్టర్ లకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిదులుగా గుంతకల్లు శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం మరియు సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మొట్టమొదటి సారిగా జరిగిన సాగునీటి ఎన్నికల్లో మీరందరు ఎన్నికవడం చాలా సంతోషకరమని మీరందరు రైతన్న సమస్యల కోసం పని చెయ్యాలని సూచించారు. అలాగే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చి వారికి అండగా ఉంటామని అన్నారు, సాధారణ వ్యక్తులను కూడా సర్పంచులను ఎంపీటీసీ, జడ్పీటీసీ లుగా చేసిన ఘనత తనది అని కచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాగే చేస్తానని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.