అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని అతి పురాతన తగ్గుదేవాలయం లో ధనుర్మాసం ఏకాదశి సందర్బంగా విశేష పూజలు చేశారు. ఆలయం లో వెలిసిన శ్రీ అనంత గజ, గరుడ, లక్ష్మీ నారాయణ స్వామి కి పుష్పాలంకరణ చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తాదులు విష్ణుసహస్ర నామ పారాయణం పఠించారు. స్వామి వార్లకు పల్లకిలో ఉంచి గోవింద నామ ఉచ్చారణ తో పల్లకి సేవ లోఆశేష జనాలు పాల్గొన్నారు
