అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జనశిక్షణ సంస్థ సహకరము తో 20 మంది మహిళానిరుద్యోగులకుఉచితంగా బ్యూటిషన్ శిక్షణ105 రోజులు నిర్వహించడము జరిగింది శిక్షణ పూర్తి చేసుకొన్న మహిళలకు బ్యూటిషన్ శిక్షణ ధ్రువపత్రాలను సిడిపిఓ ఢిల్లీశ్వరి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతాయి కాబట్టి వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది మహిళలు పలు శిక్షణలో తర్ఫీదు పొంది కుటుంబ ఆర్థిక పురోగతి సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరి మహిళలు తదితరులు పాల్గొన్నారు
