అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా వికలాంగుల సంఘం అధ్యక్షుడు లింగమూర్తి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ దేవి ఆలయ కమిటీ అధ్యక్షులు దొడ్డప్ప సహకారంతో 500 మంది వికలాంగులకు ప్లేటు ,గ్లాసు మరియు ప్రతి ఒక్క వికలాంగులకి 100 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంతకల్ వన్ టౌన్ సిఐ మనోహర్, మోటార్ వాహనాల తనిఖీ అధికారి రాజబాబు, గుంతకల్ వన్ టౌన్ ఎస్ఐ కొండయ్య, రురల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాఘవేంద్రప్ప, కసాపురం స్టేషన్ ఎస్ఐ వెంకటస్వామి, ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు గుత్తి పట్టణానికి చెందిన రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్షావలి 29 సార్లు రక్తదాతని ఘనంగా సన్మానించారు.