అనంతపురం జిల్లా పామిడి పట్టణం లోని ప్రాచీన భోగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో పోటెత్తింది. సూర్యుడు ధనుర్ రాశి లో ప్రవేశిస్తున్న సందర్బంగా ఫాల్గుణ మాసంలో సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలసి రావడం తో తెల్లవారు ఝామూనే భక్తులు బారులు తీరారు. ఈ ప్రత్యేకమైన రోజు అభిషేకం చేస్తే సర్వ శుభాలు కలుగుతాయని ఉపన్యాస వక్త చాగంటి కోటేశ్వరరావు ఉపన్యాసాలు వల్ల ప్రేరణ పొందిన భక్తులు విరివిగా పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలోని వేద పండితులు విశేష పూజలు అభిషేకాలు చేశారు. ప్రత్యేక పుష్పలతో అలంకరణ చేసి నివేదన, నవవిధ హరతులు గావించి, తీర్థ ప్రసాదాలు భక్తాదులకు అందించారు.