అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ స్థలములో పోలీస్ పెట్రోల్ బంకు ఏర్పాటుకు జిల్లా ఎస్పీ జగదీష్ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించాము త్వరలో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తామని చెప్పారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఖాళీలు భర్తీ చేస్తున్నందువల్ల సిబ్బంది కొరత రాస్తా తగ్గవచ్చునని ఆశాభావం తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి సీఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ జాపర్ రాజ్ కుమార్ మండల సర్వేర్ శేష సాయి వీఆర్వో సురేంద్ర తదితరులు పాల్గొన్నారు