- రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలి…
- తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కీసర శారద ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నీటి పండుగ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళుతున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన కీసర సురేష్ అకారణంగా ఆమెను దుర్భాషలు తిడుతూ నోటిని మూసివేసి దాడి చేశాడు. ఆ దెబ్బలకు ఆశా కార్యకర్త అరవడం వల్ల చుట్టుపక్కల ఇంటివారు బయటకు రావడంతో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే గాయపడిన శారద అతని భర్త తిరుపతి యూనియన్ దృష్టికి తీసుకువచ్చాడు వెంటనే స్థానిక తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినది, అక్కడ నుండి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చికిత్స కోసం తీసుకువెళ్లడం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి హాస్పిటల్ లో గాయపడిన ఆశ కార్యకర్తను పరామర్శించి ఈ సంఘటనను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళేందుకు మీడియా ముందు మాట్లాడారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత మాట్లాడుతూ సెలవు దినము ఆదివారం రోజున తెలంగాణ దశబ్ధి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమం నీటి పండుగ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఇంటికి వస్తున్న క్రమంలో ఇలాంటి ఆకతాయిలు భౌతిక దాడులకు పాల్పడడం చాలా దుర్మార్గం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలకు పని భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తున్నది కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. ఆశా కార్యకర్తలు రాత్రనక పగలనక గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలాంటి ఆశ కార్యకర్తలను పొద్దున్నే 10:40గంటలకు ఆమెపై దాడి చేయడం మా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాంటి వ్యక్తిపై వెంటనే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయలి,ఆశా కార్యకర్తలకు పని భద్రత,ఉద్యోగ భద్రత,రక్షణ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సరోజన,రాజేశ్వరి, వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.