- వీడిసి ఆగడాల పై మూడేండ్ల క్రితం వార్త రాసినందుకు కక్ష !
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల నవతెలంగాణ విలేకరి అట్టెం అనిల్ పై మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. వార్త కవరేజ్ కోసం వెళ్లగా దాడికి పాల్పడ్డారు. మూడేండ్ల క్రితం గుమ్మిర్యాల్ VDC ఆగడాల పై బాధితుల ఫిర్యాదు మేరకు కథనం రాయడంతో గత VDC కమిటీ రద్దు అయింది. అప్పటి నుంచి కక్ష కట్టిన కొందరు తాజా గా వార్త కవరేజ్ కోసం వెళ్లగా దాడికి పాల్పడ్డారు. దాడిని ఖండిస్తూ ఏర్గట్ల విలేకరులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
విలేరులకు రక్షణ కల్పించాలి: –
సమస్యల ను వెలికి తీస్తూ వార్తలు రాస్తున్న విలేకరులకు రక్షణ లేకుండా పోయిందని విలేకరులు ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులపై కటిన చర్యలు తీసుకొని విలేకరులకు రక్షణ కల్పించాలని పోలీసువారిని కోరారు.