- చంపేస్తామని బెదిరింపులు
- కులం పేరుతో దూషణ
పల్నాడు జిల్లా : నరసరావుపేట రూరల్ పరిధిలో గల శంకర భారతీపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తున్న మంచి శాంతి (51) పాఠశాలలో విధులు ముగించుకొని వెళ్తుండగా వారి ఇంటికి దగ్గరలో నలుగురు వ్యక్తులు కుక్కలను విపరీతంగా కొడుతుండడంతో కుక్కలను కొట్టవద్దని అన్నందుకు టీచర్ శాంతిపై అగ్రవర్ణానికి చెందిన నలుగురు వ్యక్తులు కులం పేరుతో దూషించి దాడిచేశారు. దాడిలో గాయపడిన టీచర్ ను స్థానికులు నరసరావుపేట లింగంగుంట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఘటనపై సమాచారమందుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది