contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గిరిజన సంఘం నాయకులపై దాడికి యత్నం

  • గిరిజన సంఘం క్రిష్ణరావుపై సర్పంచ్ పూర్ణిమ అనుచరుల దాడి యత్నం.
  • నరికేస్తానని బెదిరింపులకు దిగిన బినామీ(దత్తపుత్రడు)
  • దాడి చేసి ఉద్యమాన్ని ఆపలేరు,దాడులకు భయపడేది లేదు.

అల్లూరి జిల్లా,హుకుంపేట,ది రిపోర్టర్  :మండల కేంద్రంలోని గిరిజన సంఘం అల్లురి జిల్లా అధ్యక్షులు తాపూల కృష్ణా రావు పైన ప్రత్యేక్ష దాడికి పాల్పడిన సర్పంచ్  వెంకట పూర్ణిమ అనుసరులకు, కీముడు గణేష్ లను శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం,సీఐటీయూ, సీపీఎం పి.సోమన్న, టి.అప్పలకొండ పడల్,వైస్ ఎంపీపీ సుడి పల్లి కొండలరావు నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యానం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి దాడికి పాల్పడిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని
వారు ఖండించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ,టి అప్పలకొండ పడల్, వైస్ ఎంపీపీ సుడి పల్లి కొండలరావు నేతలు
మాట్లాడుతూ….. సర్పంచ్ వెంకట పూర్ణిమ పంచాయతీలో కొంత మంది పెద్దలతో అక్రమ నిర్మాణల పై ఏక పక్ష తీర్మానంచేసి రెవిన్యూ, ఆటవి శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన తీర్మానం వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన
తీర్మానం విడుదల చేశారని. దానిని ఖండించి ప్రకటన విడుదల చేయాడం జరిగిందని వారు స్పష్టంచేశారు.గంతంలో అనేకమంది గిరిజనేతరులకు కడుతున్న వాటిపై మీడియా ముందుకు గాని రెవిన్యూ, పంచాయతీ శాఖ అధికారులకు గాని ఎందుకు లిఖితపూర్వకంగా పంచాయతీ పెద్దలతో తీర్మానం
ఇవ్వడం లేదని సర్పంచ్ వెంకట పూర్ణిమను వారు ప్రశ్నించారు. గిరిజన సంఘం,సిపిఎం పార్టీ గతకొద్ది దశాబ్దాల కాలంలో నుండి 1/70 చట్టం,గిరిజనుల హక్కులు, అక్రమ నిర్మాణలు గురించి నిరంతరం పోరాటం చేస్తున్నమని నిన్ను మొన్నటి పోరాటం మాది కాదని ఇది సర్పంచ్ వెంకట పూర్ణిమ తెలుసుకోవాలని వారు గుర్తు చేశారు.గిరిజనుల ప్రజాశ్రేయసు కోసం పోరాటం చేస్తున్న గిరిజన సంఘం అల్లురి జిల్లా అధ్యక్షులు తాపూల కృష్ణా రావు పైకి ఉసీ గొల్పి దాడికి పాల్పడడం హేయమైన చర్యలు అని దీనికి పార్టీ తరుపున తీవ్రంగా ఖండింస్తున్నని వారు అన్నారు. వెంటనే సర్పంచ్ అనుసరులకు, కీముడు గణేష్ లను శాఖ పరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.గతంలో ఎన్నడూ లేని విధముగా అక్రమ కట్టడాలు గురించి వారు మాట్లాడం వెనుక అంతర్యం ఎంటో సర్పంచ్ వెంకట పూర్ణిమ వెంటనే బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనేతరుడు నల్లం కనకరాజుతో పాటు మహిమ్మద్ అలీ ,అదిన సంతోకుమర్,షేక్ వాహిథ్,బుడ్డెకు రమేష్,బుడ్డేకు కొండమ్మ కాపరపు గంగరాజు ,కిరాణా షాపు రాజు,లంక శ్రీకాంత్,భశిర్ లు
నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు పిర్యాదు చేయలేదు?
గిరిజనేతరుడు నల్లం కనకరాజు పై తహశీల్దార్ కు విరు ఫిర్యాదు చేయడం ఆశ్యస్పదంగా ఉందిని అన్నారు.  అనంతరం గిరిజన సంఘం అల్లురి
జిల్లా అధ్యక్షులు తాపూల కృష్ణా రావు మాట్లాడుతూ….. అక్రమ నిర్మాణాలపై బినామిల అండ దండలతో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం చేస్తున్నరాని మీడియాతో మాట్లాడుతూన్న తర్వాత ఆదివారం మధ్యాహ్నం కీముడు గణేష్ వారి కుటుంబాలతో నాపై దాడి చేసేందుకు నాపై వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేయడంమే కాకా నరకేస్తానని చేపి నామీద కయ్యా నికి దిగారన్నారు.వెంటనే సాయంత్రం పోలీసు స్టేషన్లో గణేష్ పై పార్టీ నేతలతో పిర్యాదు  చేశామన్నారు. సోమవారం ఉదయం 7గంటల సమయంలో సీపీఎం కొలని తన ఇంట్లో సర్పంచ్
వెంకట పూర్ణిమ అనుసరులు, వైఎస్సార్ సీపీ నేత పాంగి అనిల్,జగదిష్ తోపాటు అనేకమంది గిరిజనులు, గిరిజనేతరులు దాడికి దిగారని అయన  తెలిపారు. గిరిజనేతరుకు ప్రోత్సాహిస్తూనే నిజమైన గిరిజనులకు ఇల్లు కట్టుకుంటున్న వారి పైన రెవిన్యూ అధికారులు, సిబ్బంది బోర్డులు పాతి అన్యాయం చేయడం సరికాదని అన్నందుకే వైసీపీ నేతలతో దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.దాడులకు గిరిజన సంఘం బయపడేది లేదని దాడీల చేసి ఉద్యమంని ఎవరు ఆపలేరని వారు స్పష్టం చేశారు. అనంతరం సర్పంచ్ వెంకట పూర్ణిమ అనుసరులు,వైఎస్సార్ సీపీ నేత పాంగి అనిల్,జగదిష్ కొంత మంది పైన ఈరోజు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. ఈకార్యక్రమంలో అద్వా జిల్లా నాయకురాలు ఎస్.హైమవతి గిరిజన సంఘం అధ్యక్షుడు పాంగి సోమన్న,సీపీఎం నేత డూరు కృష్ణా మూర్తి,కోటి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :