సత్తెనపల్లి : రాజుపాలెం మండల వైసిపి యూత్ కన్వీనర్ మరియు మంత్రి అంబటి రాంబాబుకు ముఖ్య అనుచరుడు హీరా డిజిటల్ అధినేత షేక్ కరీముల్లాపై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి సత్తెనపల్లి పట్టణంలోని బైపాస్ రోడ్డు దగ్గర దాడి చేసి గాయపరిచారు.పట్టణంలో ప్రకటన బోర్డుల విషయంలో కరిముల్లాకు మరి కొంతమందికి వివాదం నడుస్తుంది.మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.ప్రకటన బోర్డుల వివాదం ఇద్దరి వైసీపీ వ్యక్తుల మధ్య కొనసాగుతుంది. పట్టణానికి చెందిన ఇద్దరు వైసిపి నాయకుల పోద్బలంతోనే తనపై దాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు .మంత్రి అంబటి రాంబాబు కరీముల్లా పై జరిగిన దాడిని ఏ విధంగా తీసుకుంటారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.