- ఏపీ డబ్ల్యూ జె కారంపూడి అధ్యక్షులు బాణావతు రాజేష్ నాయక్
పల్నాడు జిల్లా, కారంపూవుడి : పెదకూరపాడు లోని ఈనాడు పత్రికలో పనిచేస్తున్న పరమేశ్వరరావు పై దాడి చేయడం దుర్మార్గు చర్య అని శుక్రవారం ఏపీడబ్ల్యుజే కారంపూడి సభ్యులు అన్నారు. కారంపూడి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏపీడబ్ల్యూజే కారంపూడి అధ్యక్షులు బాణావత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేసే విలేకరులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విలేకరులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా నాయకులు, మాచర్ల నియోజకవర్గం సభ్యులు, కారంపూడి శాఖ సభ్యులు పాల్గొన్నారు.