అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంమండలం: వాల్మీకి పురంలో తండ్రి కొడుకు ల పై కత్తులతో దాడి చేసి హత్య ప్రయత్నం చేశారు. పోలీసుల వివరాల మేరకు మండలంలోని ఇందిరమ్మ కాలనీ కి చెందిన అంజప్ప (55), అతని కుమారుడు హరికృష్ణ (30) శ్రీరామనవమి కి చాందిని బండి కట్టారు. గుడి వద్దకు ఊరేగింపుగా వెళ్లే క్రమంలో విఠలానికి చెందిన కిషోర్ వర్గీయులతో డీజే ప్రోగ్రాంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉన్న అంజప్ప హరికృష్ణ లపై కిషోర్ వర్గీయులైన కిషోర్, ప్రతాప్, రాజు కత్తితో పొడిచి హత్య ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.