శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఇద్దరు ఆటో డ్రైవర్ లను ఆటో యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం చేశారు. వివరాల్లో కి వెళితే భగవతి శ్రీ స్వేచ్ఛావతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులైన ఆశి గోపాల్ మరియు సాడి సాయిరాం కొద్దికాలంగా వయోభారం కారణంగా ఆటో నడపలేని స్థితికి చేరుకున్నారు. వారి ఆరోగ్య మరియు వయసును దృష్టిలో పెట్టుకుని ఇచ్చాపురం పట్టణానికి చెందిన ఆటో యూనియన్ వారు వారిరువురికి 30 వేల రూపాయల చొప్పున, మొత్తం 60 వేల రూపాయలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యర్రయ్య, ముకుంద, రంగ, తులసి, మదన్, తిరుమల, శంకర్, బొబిని తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మొట్టమొదటిసారి వయసు పైబడిన ఆటో డ్రైవర్ల సంరక్షణార్థం ఆర్థిక సహాయాన్ని అందించిన భగవతి శ్రీ స్వేచ్ఛావతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పదిమందికీ ఆదర్శంగా నిలిచారు. ఇచ్ఛాపురం ఆటో యూనియన్ ప్రస్తుత అధ్యక్షులు అయిన ఉలాసి యర్రయ్య రెడ్డి ఆద్వర్యంలో, యూనియన్ కార్యవర్గ సభ్యుల అంగీకారంతో తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినది అని గ్రామానికి చెందిన పలువురు పెద్దలు కొనియాడారు.