ప్రకాశం జిల్లా: కనిగిరిలో ఏసీబీ వలలో చిక్కిన మరో అవినీతి తిమింగలం. రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా కనిగిరి మండల సర్వేయర్ అల్లం రంగస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వంగపాడు కు చెందిన రైతు కాకర్ల వెంకటేశ్వర్లు నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
