కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ ఆగ్రోస్ నిర్వాహకుడు సుధగొని సాయి తేజ ఆధ్వర్యంలో శనివారం గ్రామ నెహ్రూ చౌరస్తా లో కోరమాండల్ వారి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సేంద్రీయ వ్యవసాయం పై అవగాహన సదస్సు నిర్వహించారు. మన నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నాయని కనుక రైతులు మందు బస్తాల మీద పెట్టుబడి తగ్గించుకోవలాని సేంద్రీయ ఎరువుల వాడకం పెంచాలని, పంట మార్పిడి చేస్తూ నేల సారాన్ని కాపాడాలని రైతులకి పలు సూచనలు చేసారు మరియు మన పంట పొలాల నేల సారం తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు ఉచితంగా కంపెనీ వారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో హాజరయి తమ మట్టి నమూనా పరీక్షలు గునుకుల కొండాపూర్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రము ఆధ్వర్యంలో ఉచితంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ నిర్వాహకుడు సుధగోని సాయి తేజ, గ్రోమోర్ కంపెనీ ప్రతనిధులు సేల్స్ ఆఫీసర్ రాజేష్, అగ్రానమిస్ట్ జగన్, మార్కెట్ ఆఫీసర్ సతీష్, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
