- సైబర్ నేరగాళ్లపై నందిపేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిహెచ్ కొండూరు గ్రామంలో అవగాహన సదస్సు
- సైబర్ నేరగాళ్లు సెల్ ఫోన్ అతిగా వినియోగించడం వల్ల ఏర్పడే అనర్ధాలు రోడ్డు భద్రతను పాటించాలని కోరారు
నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో సైబర్ నేరాగాళ్లపై ఏఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో సిహెచ్ కొండూరు గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు లాటరీ వచ్చిందని ఫోను చేసి లింకు ఓపెన్ చేయమని మాట్లాడితే అప్రమత్తంగా ఉండాలని తెలపడం జరిగింది, అదేవిధంగా యువకులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు, వాహనాలు మద్యం సేవించి నడిపితే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ రాజేందర్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ బాలనోళ్ల దేవదాస్, యూత్ అధ్యక్షుడు ఆరే చిన్న రాజు, గ్రామపంచాయతీ కారోబార్ రాజేందర్, వీడిసి మెంబర్ నారిముత్తన్న, నాయకులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,