అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. మరో 24 గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు..
22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది..