విజయనగరం జిల్లా: బాడంగి మండలం లో ఈ రోజు లాక్ష్మున్నాయుడు బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలానికి చెందిన పిన్నవలస మరియు మళ్లంపేట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పింఛన్ల పంపిణీ ద్వారా బలహీన వర్గాల సంక్షేమానికి మరియు సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నందుకు వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బూడ ఛైర్మన్ గారు మాట్లాడుతూ .. వికలాంగులు, వితంతువులు, మరియు వృద్ధులకు ఈ పింఛన్ ఉపశమనం కలిగిస్తుందని, వారి జీవనోపాధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిన్నవలస సర్పంచ్ కన్నం నాయుడు, వైస్ ఎంపీపీ భాస్కరరావు , మండల తెలుగు దేశం అధ్యక్షులు రవి ,త్రినాధ్ , లచ్చుపతుల సత్యం, అప్పలనాయుడు, సూర్యనారాయణ,పెద్దలు కన్నం నాయుడు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తొ పాటు ఎంపిడిఒ రామకృష్ణ పాల్గొన్నారు.