విజయనగరం జిల్లా: జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులు సంబరాల మూడ్‌లో పాల్గొని, వారి సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శించారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా, విద్యార్థులు ముగ్గుల పొటీలు నిర్వహించారు. గాలిపటాలు ఎగురవేసి, బోగిమంట చుట్టూ గొబ్బియల్లో నృత్యాలు చేశారు. విద్యార్థినులు ప్రత్యేక వేషధారణలో జానపద నృత్యాలు, కోలాటం నిర్వహించి సందడిని సృష్టించారు.
ఈ వేడుకలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దత్తి సత్యనారాయణ, ఇంచార్జ్ హెచ్ఎం శ్రీమతి తెంటు వెంకటలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.