కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండలకేంద్రలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ నాయకులు నివాళులర్పించడం జరిగింది, ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా కార్యదర్శి తిప్పర్తి నికేష్ హాజరై మాట్లాడారు. దేశ సమైక్యత,సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని నినదించి సమున్నత, సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడు డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఆ మహనీయుడి బలిదాన్ దివాస్ సందర్భంగా నివాళులు అరిపించడం జరిగిది. ఈ కార్యక్రమంలో నాయకులు హరికాంతపు అనిల్ రెడ్డి, మునిగంటి సత్తయ్య,కుర్ర హరీష్,రాజు తదితరులు పాల్గొన్నారు.