పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఆంద్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమితులైన పెంకే జగదీష్ ని మర్యాద పూర్వకంగా చిత్రాడ శెట్టిబలిజ నాయకులు కలిసి ఘనంగా శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెంకే జగదీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసినందుకు గుర్తించి ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులకు వీర మహిళలకు ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లి శ్రీను, అనుబోయిన మధు, పిల్లి పెద్ద శ్రీనివాస్, వల్లి విజయ్ కుమార్, ఇంటి శ్రీనివాస్, కండిపిల్లి శ్రీను, దెయ్యాల శ్రీనివాస్, రాయుడు రాజు, రాయుడు శ్రీను, దెయ్యాల దుర్గాప్రసాద్, దెయ్యాల శ్రీనివాస్, తుట్ట సుబ్రమణ్యం, వల్లి దుర్గ బాబు, వల్లి నరేష్, మేడిశెట్టి వీరబాబు, కుక్కల వెంకన్న, పెంకే దుర్గబాబు, పెంకే వీరబాబు, మరియు శెట్టి బలిజ సోదరులు తదితరులు పాల్గొన్నారు.