మంచిర్యాల జిల్లా..చెన్నూరులో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ప్రసంగించిన విప్ బాల్కసుమన్. నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వద ర్యాలీకి వస్తే తమ ఆశీర్వాదంతో పాటు అభిమానాన్ని చూపెడుతూ ప్రజలు విజయానందాన్ని కలిగించారని, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు,ఇందారం మొదలుకొని జైపూర్, భీమారం, చెన్నూర్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం చెన్నూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన ప్రసంగించారు,ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బోర్లకుంట వెంకటేష్ నేత, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.