Baltimore Key Bridge Collapse After Ship Hits: అమెరికాలో బాల్టిమోర్ నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం.. ఒక భారీ నౌక ఫ్రాన్సిస్ స్కాట్ కీ అనే బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది. అప్పటికే ఆ బ్రిడ్జిమీద వాహానాలు కూడా ప్రయాణిస్తున్నాయి. భారీ నౌక కుదుపుతో, బ్రిడ్జీ ఒక్కసారిగా పేకమెడలా కూలిపోయింది. ఈ విషయాన్ని మేరీలాండ్ ట్రాన్స్ పోర్టేషన్ అథారీటి ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ ఘటన జరిగినప్పుడు అనేక వాహానాలు బ్రిడ్జీ మీద నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ నౌక కుదుపునకు లోనుకావడంతో బ్రిడ్జీ సెకనుల వ్యవధిలో కుప్పకూలీ పటాప్ స్కో నదిలోపడిపోయింది. ఈ క్రమంలో అక్కడ మంటలు కూడా చెలరేగాయి.
కాగా ఇందులో ఉన్న 22 మంది భారతీయులేనని (Indians) సినర్జీ మెరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇద్దరు పైలట్‌లతో సహా అందులోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పలు నివేదికలు వెల్లడించాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన (Francis Scott Key Bridge) కుప్ప కూలిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్.. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు (Joe Biden) ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారని అధికారులు
🚨🇺🇸 Close up clip of boat hitting structure of Francis Scott Baltimore Bridge.
It’s almost as if the boat was steered to hit the bridge gantry head on? pic.twitter.com/ir2yON7SM6
— Concerned Citizen (@BGatesIsaPyscho) March 26, 2024
అసలేం జరిగింది?
ఈ సంఘటన తెల్లవారుజామున 1:30 గంటలకు నదిని దాటుతుండగా వంతెన పైలాన్‌ను ఢీకొట్టింది. దీంతో వంతెన కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఉగ్రవాదుల ప్రమేయం లేదని అధికారులు తేల్చి చెప్పారు. వంతెన కూలిపోవడంతో పాటు ఓడలో మంటలు చెలరేగడంతో దానిపై వాహనాల హెడ్‌లైట్లు వెలుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాల్టిమోర్ అధికారులు కనీసం ఏడు వాహనాలు నదిలోకి పడిపోయాయని, తక్షణ సహాయక చర్యలను ప్రారంభించామని చెప్పారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 20 మంది వ్యక్తులు గల్లంతు అయినట్లు తెలిపారు.
ఎవరీ జాడకూడా ఇప్పటివరకు లభ్యంకాలేదు. ఈ వంతెనను 1977 లో నిర్మించినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత భారీ నౌక, బ్రిడ్జీ మధ్యలో చిక్కుకునిపోయినట్లు తెలుస్తోంది.