రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు షాకిచ్చారు. ఇటీవలే ఆయనకు 1 ప్లస్ 5తో రోప్ టీమ్ ను పోలీసులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రోప్ టీమ్ తో పాటు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, ఆయనకు పెంచిన భద్రత కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే అదనపు భద్రతను పోలీసులు వాపస్ తీసుకున్నారు. మరోవైపు బండి సంజయ్ కు భద్రతను వెనక్కి తీసుకోవడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడితోనే భద్రతను వెనక్కి తీసుకున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.