హైదరాబాద్: సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోలు విడుదల చేశారు.అంతేకాకుండా బీజేపీ అగ్రనేతలతో పాటు అవలంభిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ‘ లిక్కర్ స్కాంలో తన బిడ్డ అరెస్ట్ కాబోతుందనే పక్కా సమాచారం రావడంతో భయపడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు.అందులో భాగంగానే ”నేనింతే – నా బతుకింతే” పేరుతో తన సొంత కథ-స్ర్కీన్ ప్లే-డైరెక్షన్ లో రూపొందించిన సినిమాను ప్రగతి భవన్ లో చూపించి నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఆ సినిమాలో కొత్తదనమేదీ లేదని,జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు.కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా లిక్కర్ స్కాంలో ఆయన బిడ్డను కాపాడలేరని అన్నారు. ఇప్పటికే ఒకసారి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఓఎల్ఎక్స్ పీస్ లని,వారిని హీరోలుగా చూపుతూ చేసిన అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోమాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి,కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి,అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, సీహెచ్.విఠల్,జె.సంగప్ప తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.