కరీంనగర్ జిల్లా: జిల్లాలో బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ ఆత్మహత్య యత్నం చేశాడు. స్వంత గ్రామమైన గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ లో ఈరోజు సాయంత్రం వ్యవసాయ భావి వద్ద పురుగుల మందు తాగాడు. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించడాన్ని తట్టుకోలేక కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు
సొల్లు అజయ్ వర్మ, కిషన్రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలసింది. కాగా, ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగాన్ని టీవీలో చూసిన అజయ్ వర్మ. తీవ్ర ఉద్వేగానికి లోనైనట్టు తెలుస్తోంది. కరీంనగర్ గ్లోబల్ ఆసుపత్రిలోని ఐసీయూ లో చికిత్స తీసుకొని మెరుగైన చికిత్స కోసం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు.
