- బంగారుతల్లి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారుల అతిఉత్సాహం
- కారంపూడి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థినిలతో కారంపూడి మండల స్పెషల్ ఆఫీసర్ సమావేశం
- అధికారులు నీడలో బంగారుతల్లులు మండుతున్న ఎండలో కటిక నెల పై
- ఇదే నా బంగారుతల్లి కార్యక్రమం సార్..?
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ఏర్పాటు చేసిన బంగారుతల్లి ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కారంపూడి మండల స్పెషల్ ఆఫీసర్ పల్నాడు జిల్లా డోమా పి.డి జోసఫ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, గ్రామసర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాసిన్య నాయక్, పాఠశాల విద్యార్థినిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అధికారులు అతిఉత్సాహం చూపారు. అధికారులేమో నీడలో ఉండి ఉపన్యాసాలు ఇస్తూ బంగారుతల్లులైన ఆడపిల్లలను కటిక నెలపైన మండుతున్న ఎండలో కూర్చోపెట్టి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన కార్యక్రమం కావడంతో బంగారు తల్లి పధకం గురించి విద్యార్థినిలకు వివరించవలసిన ఆవశ్యకత అధికారుల పై ఎంతైనా ఉంది. అసలే ఒక వైపు ఉక్కపోత మరో వైపు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కనీసం నీడ కోసం టెంటును కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనంగా చెప్పవచ్చు. మరోవైపు విద్యార్థినిల కోసం కింద కూర్చున్న విద్యార్థినిలకు కనీసం వారికీ మట్టి అంతకుండా కనీసం పట్టలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. బంగారుతల్లి ముఖ్యఉద్దేశం పాఠశాలలో చదివే విద్యార్థినిలకు ఇమ్మ్యూనిటి పవర్ పెంచే విధంగా చేపట్టవలసిన పనుల గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమమే బంగారుతల్లి కార్యక్రమం స్వయంగా కారంపూడి మండల స్పెషల్ ఆఫీసర్ సభలోనే మండుటెండలో కటిక నేల పైన విద్యార్థిలను కూర్చోపెట్టి ఉపన్యాసాలు ఇస్తే విద్యార్థినిలకు ఇమ్మ్యూనిటీ పవర్ తగ్గుతుంది కానీ పెరగదు అన్నా విషయం అధికారులకు అర్థం కదా అని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.