contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు .. భారత టీవీ చానళ్లను నిషేధించాలంటూ కోర్టులో పిటిషన్

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతము ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్ కు చెందిన టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. బంగ్లాదేశ్ లోని సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిటిషన్ వేశారు.

బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా భారత టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఈ పిటిషన్ పై బంగ్లాదేశ్ హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :