అక్టోబరు మాసంలో దసరా పండుగ ఉండడంతో పాటు పలు పర్వదినాలు ఉండడంతో, బ్యాంకులకు పెద్ద సంఖ్యలో సెలవులు వచ్చాయి. ముఖ్యంగా, అక్టోబరు చివరి వారంలో దాదాపు అన్నీ సెలవులే. వచ్చే నెలలో బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసింది. అయితే ఈ సెలవుల్లో కొన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తుండగా, కొన్ని సెలవులు కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లోనే అమలు చేస్తారు
అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే…
అక్టోబరు 2- గాంధీ జయంతి
అక్టోబరు 14- రెండో శనివారం
అక్టోబరు 15- ఆదివారం
అక్టోబరు 18- కాతి బిహూ పర్వదినం (అసోంలోని బ్యాంకులకు సెలవు)
అక్టోబరు 19- సంవత్సరి పర్వదినం (గుజరాత్ లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబరు 21- దుర్గా పూజ
అక్టోబరు 22- ఆదివారం
అక్టోబరు 23- మహా నవమి
అక్టోబరు 24- దసరా (విజయదశమి)
అక్టోబరు 25- దుర్గాపూజ
అక్టోబరు 26- విలీన దినోత్సవం (జమ్మూ కశ్మీర్ లోని బ్యాంకులకు సెలవు)
అక్టోబరు 27- దసై, దుర్గాపూజ
అక్టోబరు 28- నాలుగో శనివారం, లక్ష్మీపూజ
అక్టోబరు 29- ఆదివారం
అక్టోబరు 31- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి