- ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మెన్ సతీష్ కుమార్ లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ .
ఢిల్లీలోని రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ను బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ కలిసి సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్య వెళ్లే వందే భారత్ ఎక్సప్రెస్ రైలు కి బాపట్ల లో స్టాప్ ఇవ్వవలసింది గా లెటర్ ఇవ్వటం జరిగింది.
బాపట్ల కేవలం జిల్లా కేంద్రం మాత్రమే కాదు పార్లమెంటు నియోజకవర్గం కేంద్రం కూడా, బాపట్ల లో వందే భరత్ ఎక్సప్రెస్ రైలు స్టాప్ ఇవ్వటం వలన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఉద్యోగులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికీ, విద్యార్థులకు మరియు తిరుమల దర్శనం కి వెళ్లే భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని వివరించటం జరిగింది. ఇంకా బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రైల్వే కి సంబంధించిన కొన్ని సమస్యలను వివరించడం జరిగింది.