మదనపల్లి : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం లోని బసినికొండ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మదనపల్లి పట్టణం నుంచి నిమ్మలపల్లి మండలం మరియు ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రమైన బోయకొండకు వెళ్లే రహదారిపై డ్రైనేజీ ప్రవహిస్తున్నా అధికారులు కానీ, పాలకులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కాల్వల్లోని ము రుగునీరు ముందుకు కదలడం లేదు. అనేకచోట్ల ము రుగునీరు నిల్వ చేరి కుంటలను తలపిస్తోంది. అ లా ఏర్పడిన కుంటలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మా రాయి. కొన్నిచోట్ల కాల్వల నిర్మాణమే లేదు. కా లనీలు, శివారు ప్రాంతాల్లో కాల్వలు నిర్మించకపోవటంతో మురుగునీరు అనేకచోట్ల కుంటల్లా నిల్వ ఉం టుంది. దీంతో దోమలు, కీటకాలు ఎక్కువ య్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నార. కంపును భరించ లేకపోతున్నామని చెప్తున్నారు. దోమల దాడితో ఇబ్బందులు పడుతు న్నామని అంటున్నారు. మురుగు ముందుకు పోక ఎక్కడికక్కడే నిలిచి పోవ డంతో దోమలకు ఆవాస కేంద్రంగా మారాయి. పంచాయతీ అధికారులు స్పందించి కాలువల్లో పేరుకున్న పూడికను తీయించి మురుగును వెళ్లబెట్టాలని గ్రామ స్థులు కోరుతున్నారు.
