మదనపల్లి :పట్టణం నిమ్మనపల్లె సర్కిల్ దగ్గర మాజి సైనికుల సంఘం కార్యాలయం నందు మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ బిసి చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు బిసి. రమణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లె పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ జి. సహ జీవన్ బాబు ను ఆంధ్రప్రదేశ్ బిసి చైతన్య సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి గాను మరియు మదనపల్లె నియోజక వర్గ అధ్యక్షులు గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు బిసి. రమణ మాట్లాడుతూ కాలాలు మరినా బిసి ల భవిష్యత్తు మారడం లేదన్నారు. బిసి ల్లో చైతన్యం తీసుకు రావడానికి రాష్ట్రం నలు మూలల తిరిగి కమిటిలు వేస్తున్నామన్నారు. బిసిల లో చైతన్యం రావాలన్నారు. సహజీవన్ బాబు మాట్లాడుతూ మండల్ కమీషన్ నివేదిక అంశాలను అమలు చేయడం లేదని ఎస్సి, బీసీ వర్గీకరణ 1,2,3,4 చేపట్టలేదని, స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళు గడిచిన బిసిలకు ఇంకా రాలేదన్నారు. 543 పార్లమెంట్ స్థానాల్లో 52 శాతం బిసి ల జనాభా దమాషా ప్రకారం 275 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే బిసి లకు ఇప్పటికి కేవలం 42 స్థానాలు మాత్రమే కేటాయించడాన్ని ఆక్షేపించారు. ఈ సమస్య పరిష్కారానికి బీసీ కుల గణన ఒకటే మార్గం అని తెలిపారు. బిసి కుల గణన చేపట్టే వరకు తమ పారాటం ఆగదన్నారు. భరత దేశం లో బిసి లకు ప్రజాస్వామ్యం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిది అర్జె వెంకటేష్, మునిసిపల్ కాంట్రాక్టర్ సత్య నారాయణ, మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు, టిడిపి నాయుకులు కంచర్ల చింటూ,ఉమేష్, మాజీ కౌన్సిలర్ రాజ్ శ్యాం, బాబ్జి, వాల్మీకి సంఘం నాయకులు లక్ష్మినారాయణ, మే దర సంఘం నాయకులు కట్ట నారాయణ, ముస్లిం యూత్ హమీద్, సయ్యద్ లు పాల్గొన్నారు.