టీఎస్ యుటిఎఫ్ గురుకుల రాష్ట్ర సబ్ కమిటీ పిలుపుమేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా కాగజ్ నగర్ లోని బిసి బాయ్స్ హాస్టల్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంలో గురుకుల పాఠశాలలో వారికి సంఘీభావం తెలిపిన టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి.
వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 18 రోజులపాటు నిర్వహించనున్న సమ్మర్ క్యాంపు లో ఉపాధ్యాయుల విల్లింగ్ తీసుకుని నిర్వహించాలని లేనిపక్షంలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే 50 శాతం పైగా పదవ తరగతి విద్యార్థులకు అధికారుల ఉత్తర్వుల మేరకు సిలబస్ పూర్తి చేశారని అంతేకాకుండా పాఠశాలల్లో పక్కా భవనాలు లేక ఇరుకైన తరగతి గదుల్లో మౌలిక వసతులు లేక అరకుర వసతులతో అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేసవిలో మండుటెండలు చిన్నచిన్న తరగతి గదిలో క్యాంపులు నిర్వహించడం విద్యార్థుల కు కూడా చాలా ఇబ్బందికరమని తెలియజేశారు,,ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు పాఠశాలకు వెళ్లి 18 రోజులపాటు క్యాంపుల్లో పాల్గొనడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అందులోనూ మహిళా ఉపాధ్యాయులు వారి చిన్నచిన్న పిల్లలతో ఎండ తీవ్రతకు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, ,ఇప్పటికే గురుకుల పాఠశాలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వారు విధులు నిర్వహిస్తూ అధిక భారం పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పండగ సెలవులు మరియు ఎలాంటి సెలవులు లేకుండా హాలిడే డ్యూటీలు సంవత్సరం మొత్తంగా చేస్తూ వచ్చారు, కనీసం వేసవికాలంలో అయినా వారి కుటుంబాలతో గడిపే పరిస్థితి ఉంటే బాగుంటుందని సొసైటీ కార్యదర్శి ఆ దిశగా ఆలోచించాలని తెలియజేశారు, అన్ని సొసైటీల గురుకుల పాఠశాలలకు సమయసారని లో మార్పు చేసినప్పటికీ బిసి గురుకులానికి సంబంధించి ఇప్పటివరకు సమయంలో మార్పు చేయకపోవడం సరి అయింది కాదని స్పష్టం చేశారు, సంవత్సరకాలం వారు పని ఒత్తిడి అధిక భారం కూడా ఆలోచించకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేశారని కనీసం వేసవి సెలవుల్లో ఆయన వారి కుటుంబాలతో గడిపే విధంగా ఉండాలి కాబట్టి విల్లింగ్ ఉన్న ఉపాధ్యాయులను క్యాంపులకు alot చేస్తూ వారికి ఆర్జిత సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మహిపాల్, మండల బాధ్యులు హేమవాణి ,నంద, సోనిలాల్, ఆనంద్ మరియు గురుకుల సిబ్బంది ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.