బెల్లంకొండ మండల నది పరివాహక గ్రామామైన ఎమ్మాజి గూడెం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంకొండ ఎస్సై సుదీర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయటంతో దిగువకు సుమారుగా 60 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేయడం జరిగిందని కావున మండల పరిధిలోని గల జాలర్లు ఎవరు కూడా కృష్ణ నదిలోకి చేపల వేటకు వెళ్ళరాదని పడవలు నడపరాదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముద్దొస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే రెవిన్యూ శాఖకు లేదా పోలీస్ వారికి సంప్రదించాలని వారు తెలిపారు