సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోని మిట్టల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం నుండి డాక్టరేట్ పట్టాను పొందారు. పరిశోధనకు సంబంధించిన మౌఖిక పరీక్షను శనివారం నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్ మితిలేష్ పాండే మరియు డా. శబనం గులాటి పర్యవేక్షణలో సోషల్ మీడియా విభాగంలో ‘ ఏ స్టడీ ఆన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఆన్ కస్టమర్ గ్రీన్ పర్చసే ఇంటెన్షన్’ అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతు తన పీహెచ్డీ పరిశోధన సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసే సంస్థలకు మరియు గ్రీన్ ప్రొడక్ట్ కొనలనుకునే వినియోగదారులకు ఉపయోగకరమైన సమాచారం పై అవగాహన కల్పిస్తుందని చెప్పారు. ఈ పరిశోధన పూర్తి చేయడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు చెప్పారు.