సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మే చేస్తున్న గ్రామ పంచాయితీ కార్మికుల 12 వ రోజు సమ్మే లో బిక్షాటన కార్యక్రమం లో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానకొండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ నిషాని రామచంద్రం పాల్గొని విరాళం అందించి సమ్మెకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 12 రోజులుగా సమ్మే చేస్తున్న కార్మికుల సమస్యల గురుంచి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడక పోవడం సిగ్గు చేటు అని అన్నారు. ప్రభుత్వ తీరు కు నిరసన గా ఈ రోజు మండల కేంద్రం లో భిక్షటన చేసారు. బహుజన రాజ్యం లో ఇలాంటి సమ్మే లు ఉండవని, వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వం ను గద్దె దించాలని అన్నారు. ఈ సమ్మే లో మండల అధ్యక్షులు మాతంగి తిరుపతి, గ్రామ పంచాయితీ సిబ్బంది మండల అధ్యక్షులు బోనగిరి లక్ష్మన్,కోరిపు శివ, కొంకటి అశోక్, కొడముంజ బాబు, లచ్చవ్వ, బాలవ్వ,మాతంగి కొమురవ్వ తదితరులు పాల్గొన్నారు.