సిద్దిపేట జిల్లా: ద రిపోర్ట్ టీవీ : గత నాలుగు రోజుల నుండి బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఆశావాహులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి బెజ్జంకి మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ ఆవరణలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మద్దతు ప్రకటిస్తూ తాసిల్దారుకు డబల్ బెడ్ రూమ్ కోసం 2018లో శిలాఫలకం ఆవిష్కరించిన స్థలంలో ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ మండల మండల కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్,బిజెపి టౌన్ ప్రెసిడెంట్ సంఘ రవి, బీఎస్పీ బీసీ సెల్ కన్వీనర్ఉప్పులేటి శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు రోడ్ల మల్లేశం, దోనే వెంకటేశ్వరరావు,శనగొండ శ్రావణ్ కుమార్, సంఘం రాజేందర్, బీఎస్పీ నాయకులు కాంపల్లి నరేష్, బండి శేఖర్, బెజ్జంకి రాజేందర్,శ్రీనివాస్, బిజెపి నాయకులు గంప లవన్ కుమార్,బేగంపేట గ్రామ ఇండ్లు లేని నిరుపేదలు పాల్గొన్నారు.