contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బెజ్జంకిలో భారాస నాయకులు సంబరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా ఎన్నికలకు భారాస అభ్యర్థుల మొదటి జాబితా లో మన శాసన సభ్యులు డా రసమయి బాలకిషన్ కి టికెట్ కేటాయించిన నేపథ్యంలో పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి,స్వీట్లు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్,జడ్పీటిసి కనగండ్ల కవిత తిరుపతి, స్థానిక సర్పంచ్ ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్ తోకలసి కలిసి పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానంలో ఎమ్మేల్యే రసమయి బాలకిషన్, మూడవ సారి ఎమ్మేల్యే గా గెలిచి మంత్రి పదవి పొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్లు, వార్డ్ సభ్యులు,రైతు సమన్వయ సమితి, మార్కెట్,సొసైటీ సభ్యులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :