సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలను ఈ రోజు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది, పాఠశాలలో విద్యార్థులు మూత్ర శాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు, మూత్ర శాలలు ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా పడి ఉన్నాయని మూత్ర శాలల చుట్టూ విపరీతమైన గడ్డి పెరిగి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సౌకర్యాలు కల్పించి మూత్రశాలలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టాలని, పాఠశాలలో విద్యార్థి తల్లిదండ్రులకు అన్ని విషయాలు తెలిసే విదంగా ఉండాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.