సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో 2018 సంవత్సరంలో గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ భూమిలో శిలాఫలకం పెట్టి, 2019లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక కోటి 60 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించి ఆ ప్రభుత్వ భూమిని మార్కెట్ యార్డు నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నానికి నిరసనగా సోమవారం బెజ్జంకి మండల బీఎస్పీ పార్టీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో ఇండ్లు లేని, ఇంటి స్థలాలు లేని నిరుపేదలతో ప్రజలకు గతంలో ఇండ్లు నిర్మించి ఇస్తానన్న స్థలంలో గుడిసెలు వేసి పేద ప్రజల న్యాయమైన డిమాండ్ కు మద్దతు ప్రకటించడం జరిగింది, ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం హాజరై తన మద్దతును ప్రకటిస్తూ స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గతంలో శంకుస్థాపన చేసిన శిలాఫలాక ఆవిష్కరణకు కట్టుబడి గ్రామంలోని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఇల్లు లేని పేదల పక్షాన బీఎస్పీ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు, ఇలాగే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వచ్చే ఎన్నికలలో రసమయి బాలకిషన్ ను సిద్దిపేటకు మానకొండూరు ప్రజలు పంపిస్తారని అన్నారు, అలాగే స్థానికుడైన మంత్రి హరీష్ రావు తన సొంత మండలం బెజ్జంకిని దత్తత తీసుకొని సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానన్న మాటలు ఏమయ్యాయని ఎద్దేవ చేశారు, బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బహుజనులకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో పేద ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మరియు ఫామ్ హౌస్ లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు ఎగోల వెంకన్న గౌడ్, కుమ్మరి సంపత్, జిల్లా కమిటీ సభ్యులు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ అధ్యక్షులు బోనగిరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు, కార్యదర్శి కొంపల్లి పరశురాములు, ఉప్పులేటి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ లింగాల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బండి శేఖర్, బర్ల బాబు, బర్ల కొమురయ్య, కాంపెల్లి బాబు, మహిళలు హిమబిందు, వెదురు భారత, గన్నారపు రాజవ్వ, బర్ల రజిత, బెజ్జంకి రాజేందర్, పవన్, చిలుముల అనిల్,అంజి,శ్రీనివాస్,హరీష్, చంద్రయ్య, శ్రీనివాస్, కడ మంచు చందు, తదితరులు పాల్గొన్నారు