- హరీశన్న మాకేమిటి ఈ పరేషాన్ అన్నా!
- బెజ్జంకి మండలం బలవంతంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలుపుకొనిఅభివృద్ధి మరిచారు.
- దశాబ్ది ఉత్సవాల లేక గులాబీ ఉత్సవాలా?
- ప్రజల సొమ్ము నీళ్లలా ఖర్చు చేస్తున్నారు.
- రైతు రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారు?
- దళిత బంధు కథ కంచికి చేరింది..!
- బీసీ బంధు ముందటికి వచ్చింది!
సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు మండల పర్యటనకు వస్తున్న రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావుకు మండల ప్రజల తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక ప్రశ్నలు సంధించారు.
మీ పర్యటన ఎవరికీ మేలు .. మీ వల్ల మాకు తీవ్ర నష్టమే గాని లాభం ఏమాత్రం లేదు నీ అనుచరులు ఇసుక దందాలా పరిరక్షణ కోసమా ? తోటపల్లి ప్రాజెక్టు భూమి ఎలా ఎగేరేసుకుపోవలనా ? దాచారం భూములల్ల మీ పరిశ్రమలను పెట్టి పక్క భూములను కాలుష్యం చేయాలనా ? రసమయి ఆక్రమణలను సబబే అని చెప్పడానికా ? ఎందుకొస్తున్నారు.
బెజ్జంకి గుడిని పర్యాటక కేంద్రం చేసినందుకా , 100 పడకల ఆసుపత్రి ప్రారంబోత్సవానిక , మినీ ట్యాంక్ బండ్ల శోభను చూడడానికా ? ఒక్కసారి వేసిన మీ లక్ష రూపాయల స్తంభం లైటు పొతే పక్కన పారేసినది సూసెతందుకా ?
మీ స్వార్థం వలన మా గుండెకాయ కరీంనగర్ జిల్లాను కోల్పోయాం , మీ నుండి మీ అనుచరులు లబ్ది పొందారేమో గాని ప్రజలకు ఒరిగిందేమి లేదు . రాష్ట్రములో మా మండలానికి వేరే ఒక్క మంత్రి పర్యటలు లేకుండా చేస్తివి!.. మా బీసీ మంత్రి రావద్ద , మా రసమయికి మీరొక్కరే ఎందుకు కనబడుతున్నారు .దోసుకోవడానికి బెజ్జంకి మండలం మీ అడ్డాగా మారింది . మీ సిద్దిపేట జిల్లాకు డంప్ యార్డు, స్మశాన వాటికగా మారింది. బెజ్జంకి అభివృద్ధి మీద ద్యాస లేనప్పుడు ఎందుకు కలుపుకున్నారు ..? ఒక మంత్రిగా ఏ జిల్లా అయితేంది అభివృద్ధి చేయడానికి .. మీ స్వార్థం కోసం చేయడం లేదా మీ స్వార్థం కోసం 30, 31యాక్టు పెట్టి మా ఉద్యమానికి ఎందుకు అడ్డుపడుతున్నారు .. మీకా భయమెందుకు ? శిథిల పాఠశాలలు కూలుతుంటే .. బాగున్నా పంచాయతీ భవనాలను కూల్చి మల్లి మల్లి కట్టడానికి ప్రగతి భావనమా ? ప్రజా ధనం దుర్వినియోగమా?
పాఠశాలలను క్రీడా ప్రాంగణాలుగా మార్చేందుకా? క్రీడ మైదానాన్ని మొదలుపెట్టి ఒదిలివేసినది చూడడానికా ?
తోటపల్లి ప్రాజెక్టు ఫ్రంట్ పైలాన్ గులాబీ సార్కరు ముళ్లపొదలతో వెక్కిరిస్తున్నది చూడడానికా ? మీరు కరీంనగర్ జిల్లా రోడ్డు నుండి కాకుండా సిద్ధిపేట జిల్లా కేంద్రానికి వెళ్లే పోతారం దారిలో బైక్ పైన రావాలి మా రోడ్ల పరిస్థితి చూడాలి.
ప్రతిపక్షాలు మిమ్మలను కలిసే అవకాశం కల్పిస్తే మీ నాయకులు పనితీరు అవినీతిని వివరిస్తాం
అస్సలు మీ వచ్చుడే ఎదో మరో కుట్ర పన్నడం కోసం … 24 మండలాలున్నాయి మా మండలాన్ని వదిలేయ్ , గంజి నీళ్లు తాగి ఐన కరీంనగర్ జిల్లాలో బతుకుతాం మాట్లాడితే కేసులు పెట్టు .. అని చెప్పడానికా ? రైతులంటే తెరాస వాళ్లేనా .. రైతు భవనము, మండల అభివృద్ధి భవనంలో శిలాఫలకం పైన MLC జీవన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టరు రసమయి ఇంట్ల సొమ్ముతో కడుతుండా .. లేక మీరే ప్రజాప్రతినిధులా .. ఎవరు మీ లెక్క ఎన్నిక కాలేదా ? ఒక్కసారి మండల రోడ్లు సూడు .. .మీ నాయకుల ఆగడాలకు అతలాకుతలం అవుతున్న మా బతుకులు చూడు .. బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు చొరవచూపండి అని మండిపడ్డాడు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శానగోండ శ్రావణ్ కుమార్, మానకొండూర్ సోషల్ మీడియా ఇంచార్జ్ ధోని వెంకటేశ్వరరావు రవి, గూడెల్లి శ్రీకాంత్, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నాజీ చిన్న, వెన్నం రాజు తదితరులు పాల్గొన్నారు.