మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలోని ఆవడం గ్రామంలో గుండ్లసోమారం, జెండావెంకటాపూర్, గంగారం, ఆవడం, కొత్తుర్, చిత్తాపూర్, చిన్నవెంకటపూర్, మెట్ పల్లి, నార్వాయిపేట గ్రామపంచాయతీల బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య .పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బి అర్ ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెసిఆర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పునాదిలాంటి వారని, నియోజకవర్గ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, రానున్న ఎన్నికల్లో కెసిఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని సూచించారు …
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల గారు, మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, పాక్స్ చైర్మన్ మల్లేష్ , ఇతర ప్రజాప్రతినిధులు, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అశోక్ గౌడ్ గారు, ఆత్మ చైర్మన్ రాజు, నెన్నెల, వేమనపల్లి మండలాల అధ్యక్షులు సాగర్ గౌడ్, వేణుమాధవ్ రావు, నాయకులు భీమగౌడ్ , కార్యకర్తలు, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు …