కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో నిరంతర త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రతలో విభాగం లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామనికి ప్రశంస పత్రాలతో పాటు మెమొంటోను గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, అందుకున్నారు, ఎంపీడీవో పీవీ నరసింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి కె ఆనంద్, కంప్యూటర్ ఆపరేటర్లు రాజశేఖర్, శివసాయి లను మంత్రివర్యులు గంగుల కమలాకర్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ శాలువలతో సత్కరించారు